తెలంగాణా వచ్చాకే పవన్ సినిమా విడుదల?

తెలంగాణా వచ్చాకే పవన్ సినిమా విడుదల?


తెలంగాణా అంశం పవన్ సినిమా "అత్తారింటికి దారేది" కి ముడిపడింది. విషయం ఏంటంటే టాలీవుడ్ లో పవన్ తన సినిమాతో  సిద్ధంగా ఉన్నాడు.ఈ రోజు తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం పై నిర్ణయం వెలువడితే "అత్తారింటికి దారేది" సినిమాని మరో నెలరోజుల పాటు వాయిదా వేయాలని నిర్మాత డిసైడ్ చేసుకున్నాడట. ఇప్పటికే "ఎవడు" సినిమా వాయిదా పడింది. కేంద్రం నిర్నయించబొయె విషయం గమనించి ఈ సినిమా బయటికొస్తుందట. లేదంటే మరో నెల వరకు ఆగాల్సిందే.
 రాష్ట్ర పరిస్థితుల ప్రకారం రాష్ట్రం వస్తుందని కేంద్రం నిర్ణయిస్తే అటు ఆంధ్రలో గొడవలు తలెత్తుతాయి అలాగని రాదని చెబితే తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి, కావున ఈ పరిస్థితుల మధ్య సినిమాలు విడుదల చేసుకోకపోవడమే మంచిని అనుకుంటున్నారు. ఈ విషయం కారణంగానే అత్తారింటికి దారేది సినిమా వాయిదా పడొచ్చని అనుకుంటున్నారు. ఇక డిల్లీ వెళ్ళిన పెద్దలు చెప్పే కబురు కోసం వేచి చూడాలి. అయితే భారి అంచనాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రం ప్రేక్షకుల ముందుకు ఆగష్టు 7న వస్తుందా రాదా అన్న విషయం మాత్రం ఈరోజు తేలుతుంది. 

No comments

Powered by Blogger.