మహేష్ బాబు, తమన్నా, కొత్త హీరొయిన్?


మహేష్ బాబు, తమన్నా, కొత్త హీరొయిన్?


ప్రిన్స్ మ‌హేష్‌బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా "ఆగడు", ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన తమన్నాను ఎంపిక చేశారు. కథ ప్రకారం మరో హీరొయిన్ కి స్థానం ఉండగా కొత్త హీరొయిన్ కోసం సంప్రదిస్తున్నారట డైరెక్టర్ శ్రీనువైట్ల.
 అయితే ఈ సినిమాలో రెండో హీరొయిన్ అయిన ఐశ్వర్య అనే హీరొయిన్ ను సెలెక్ట్ చేసారట. ఇంతకి ఐశ్వర్య ఎవరు అనుకుంటున్నారా కంగారుపడకండి, ఈమె యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్ కుమార్తె నే ఈ ఐశ్వర్య.  ఇటీవ‌లే అర్జున్‌ తో అలాగే వారి కుమార్తె అయిన ఐశ్వర్యతో ఈ  సినిమాలోని  హీరొయిన్ పాత్ర కై ద‌ర్శకుడు శ్రీనువైట్ల వెళ్లి వారితో సంప్రదింపులు జరపగా ఓకే అనేసిందట ఈ అమ్మడు.ఇదే కాకా తెలుగు సినిమాలో మొదటి సినిమానే మహేష్ బాబు తో నటించే అవకాశం రావడం తో తెగ అనందం తో ఒప్పేసుకుందట ఐశ్వర్య. అలాగే ప్రస్తుతం ఐశ్వర్య త‌మిళంలో, మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తుంది.

No comments

Powered by Blogger.