ఈ రోజు నుండి షూటింగ్ మొదలు కానున్న మహేష్ బాబు "ఆగడు" చిత్రం

www.tgcinemanews.blogspot.com

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు కానుంది. ఈ సినిమా లో చివరికి తమన్నా ని ఎంపిక చేసిన విషయం మనకు తెల్సిందే. కాగా  మొదటిసారి తమన్నా మహేష్ బాబు సరసన నటించనుంది.ఈ సినిమాలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రం అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే తమన్నా కూడా ఈ చిత్రం లో  పూర్తి మాస్ పాత్రలో కనిపించనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ స్వరాలను అందిస్తునాడు. ఈ ‘ఆగడు’ సినిమావచ్చే సం. 2014 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

No comments

Powered by Blogger.